Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

ప్రణిపత్తి
బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి

నీరక్షీర విభాగకౌశలమహానిష్ఠా గరిష్ఠా త్మ ధా

రారారజ్యదమోఘ కారణజనుర్భావాంతతాద్వైత వి

స్ఫార శ్రీయతిరాజమౌళికి మనస్కారమ్ముగా మన్నమ

స్కారమ్ముల్‌ స్పృశియించుతన్‌ పరమహంస స్వామిపాదాలకున్‌

తైజసమైన మోక్షపరతంత్రమహోజ్జ్వలప్రత్న రత్నరుక్‌

శ్రీజిత తాపితాఖిల పరేణ్యనతోన్నత సంప్రదాయ పృ

థ్వీజతుకామకోటిమునిపీఠ విభాసితమూర్తికిన్‌ పరి

వ్రాజక చక్రవర్తికి కరమ్ము కరమ్ములు మోడ్పు వెట్టెదన్‌ ||

ప్రణవ స్వస్తిక శాబ్దబోధిత సహప్రారాంత మేధాప్రశాం

తినికేతాదృత నాదబిందుకకళాతీతోర్జితానంద కం

దునకున్‌, ముక్తిఝరీ నిరంతరిత సాధుశ్రీకి ఆచార్య దే

వునకున్‌, దోసిళు లొగ్గెదన్‌ భవభయంబుల్‌ మ్రగ్గగా మ్రొగ్గుచున్‌ ||

భవదురితానుబద్ధ పరభావజ దోష నుషీకుషీదమున్‌

పరమ తపోనిభూతిని ప్రపంచ జనావళి నుద్ధరించి శం

కరముగ జేయుపూజ్యచరణాబ్జు జగద్గురు చంద్రశేఖరేం

ద్రఋత సరస్వతిన్‌ వినమితార్తుండవై ప్రణిపత్తి జేసెదన్‌ ||

తమసుజీల్చుచు జ్యోతిలోనికి దారి జూపవెస్వామి! మృ

త్యుముఖమున్‌ విదలించి మాకమృతోదయమ్మును తెమ్మ స

త్యమును జోపుచు సత్యమార్గము నందజేయవె ఓ ప్రభూ!

క్షమను జూడుము కంచిససన్ముని చంద్రశేఖర పాహిమం!!


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page